సభలో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమైన జయప్రద... ఓదార్చిన బీజేపీ కార్యకర్తలు!
- యాసిడ్ పోస్తామని బెదిరించారు
- నా వెనుక ఇప్పుడు బీజేపీ ఉంది
- ఇంకెప్పుడూ ఏడ్వను
అందాలతార జయప్రద రాజకీయాల్లో మరో ఇన్నింగ్స్ ఆరంభించారు. సమాజ్ వాదీ పార్టీలో చేదు అనుభవాలు చవిచూసిన తర్వాత ఇప్పుడు బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీచేస్తున్న ఆమె నేడు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అయితే, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. సమాజ్ వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ తనను తీవ్ర వేధింపులకు గురిచేశారని చెబుతూ ఓ దశలో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. రాంపూర్ ను వదిలిపెట్టి వెళ్లకపోతే యాసిడ్ పోస్తానంటూ బెదిరించారని జయప్రద వెల్లడించారు.
తన పుట్టినరోజుకు బీజేపీ ఇచ్చిన కానుక ఈ ఎంపీ టికెట్ అని తెలిపారు. తన ప్రసంగం మధ్యలో ఉద్విగ్నతకు గురైన జయప్రద కాసేపు మాట్లాడలేకపోయారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు వేదికపైకి వచ్చి జయప్రదకు సంఘీభావం ప్రకటించారు. ఎన్నికలు ముగిసేవరకు జయప్రదకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తామంటూ ప్రతినబూనారు. దాంతో ఆమె తిరిగి ఉత్సాహం పుంజుకున్నారు. ఈరోజు తనవెంట బీజేపీ సైన్యం తోడుందని, మరెప్పుడూ ఏడ్వనని కళ్లు తుడుచుకుని మళ్లీ ప్రసంగం కొనసాగించారు.